October 22, 2024
Cross registrations
Cross registrations

Cross registrations: అడ్డ దారిలో.. అడ్డగోలు రిజిస్ట్రేషన్లు..!

” మేడిపండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. విశ్వదాభిరామ వినరా వేమ..!” అన్న చందంగా తయారైంది ఆర్మూర్ లోని కొందరి అధికారుల పరిస్థితి. వచ్చిన కొత్తలో డాం డూమ్ అంటూ బీరాలు పలికిన అధికారులు పోను పోను వ్యాపారస్తులతో చేతులు కలుపుతూ అడ్డగోలు రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారు. దీనికి తోడు పాత ఇండ్లను కూల్చి నూతన గృహ నిర్మాణం కోసం ఇవ్వాల్సిన డిస్మిటల్ సర్టిఫికెట్లలో కూడా భారీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణ వినబడుతున్నాయి.”

Cross registrations: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పాత ఇళ్లకు ఉన్న ఇంటి నెంబర్లతో ఖాళీ స్థలాల్లో పదుల సంఖ్యలో అడ్డ దారిలో కొందరు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతున్నారు. కొంతమంది అధికారులు బిల్డర్లతో చేతులు కలిపి అక్రమ రిజిస్ట్రేషన్లకు ఆజ్యం పోస్తూ వారికి కావలసిన డిస్మిటల్ సర్టిఫికెట్లను అనుకూలంగా జారీ చేస్తూ అడ్డదారుల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి సహకరిస్తున్నారు. కాలానికి తగ్గట్లుగా ఆధునిక హంగులతో సొంతింటి కలలను నిజం చేసుకోవడానికి గతంలో నిర్మించిన పాత కట్టడాలను కూల్చివేసి కొందరు కొత్త హంగులతో ఇంటి నిర్మాణాలను చేసుకోవాలన్న కళ మధ్యతరగతి కుటుంబంలో సహజం.

బిల్డర్లు మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై..

ఆర్మూర్ మున్సిపల్ గా అభివృద్ధి జరగకముందు గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించిన కొన్ని ఇళ్ళను కూల్చి కొత్త నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన బిల్డర్లు మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై డిస్మెటల్ సర్టిఫికెట్లను పొందుతున్నారు. గతంలో ఆరు బయట విశాలంగా ఉండాలన్న ఆలోచనతో కొంతమంది ఇంటిని చిన్నదిగా అనుకూలంగా నిర్మించుకున్నారు.

కానీ దినదిన అభివృద్ధి చెందుతున్న సమయంలో ఆధునికతను సంతరించుకున్న క్రమంలో పాత కట్టడాలను కూల్చి నూతన ఇంటి నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇదే అదునుగా భావించిన కొందరు పాత ఇంటి పక్కన ఉన్న స్థలాల్లో అదే ఇంటి నెంబర్ తో ఖాళీ స్థలాలకు కూడా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో జోరుగా కొనసాగుతున్నాయి.

అక్రమ రిజిస్ట్రేషన్లకు తెర..

అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గతంలో ఉన్న ఇంటి నెంబర్ తో ఆ చోట ఉన్న ఖాళీ స్థలానికి పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లకు పాల్పడుతూ అడ్డదారులు అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. మున్సిపల్ శాఖ నుండి వారికి అనుకూలంగా డిస్మిటల్ సర్టిఫికెట్ జారీ చేయించుకుని రిజిస్ట్రేషన్ల సమయంలో వాటిని చూపుతూ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులను మచ్చిక చేసుకుని అక్రమ రిజిస్ట్రేషన్లకు కొందరు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే వారికి అండగా నిలవడం విస్మయం కలిగిస్తుంది.

దీనికితోడు కూల్చివేత జరిగే సమయంలో పక్కన ఉండే అనధికార స్థలాలను కూడా వారు కబ్జాలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితేనే పేదోడి పై పెత్తనం చెలాయించే మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న బడాబాబులకు వత్తాసు పలకడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ తో పాటు సబ్ రిజిస్టర్ కు బిల్డర్లకు మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు చేతులు మారినట్లుగా తెలుస్తోంది.

ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలను “ప్రజా శంఖారావం” తెలుగు దినపత్రిక పాఠకుల కోసం రెండవ సంచికలో ప్రచురిస్తాం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!