** కౌన్సిల్ సభ్యుల సమక్షంలో బాహాబాహి..!
** మున్సిపల్ కార్యాలయంలో బూతు మాటలు..?
* ఒకరిపై మరొకరి అవినీతి ఆరోపణలు..?
Craving for a chair: ఆర్మూర్, నవంబర్ 21 (ప్రజా శంఖారావం): అర్హత ఉన్నా లేకపోయినా కావలసిన కుర్చీ కోసం తాపత్రయం పడటం సర్వసాధారణంగా మారింది. అర్హతను బట్టి అధికారం ఇవ్వాల్సిన చోట అర్హత లేని వారు అందలం ఎక్కడంతో వ్యవస్థ పక్కదారి పడుతుందన్నది అక్షర సత్యం. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రజాప్రతినిధులు సైతం అర్హతలు లేని వ్యక్తులు ఆర్భాటంగా కుర్చీ కోసం ఎంత దూరమైనా కుస్తీ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం, వ్యక్తిగత దూషణలు ఇందుకు చక్కటి ఉదాహరణ. మున్సిపల్ కమిషనర్ ఏ రాజు, కార్యాలయ మేనేజర్ హయ్యూమ్ ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకానొక దశలో అవినీతి ఆరోపణలు నువ్వు చేశావంటే నువ్వు చేశావని కౌన్సిల్ సభ్యుల ఎదుట వాగ్వవాదం జరగడం గమనర్హం. అసలు విషయానికి వస్తే మేనేజర్ హయూమ్ భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లాల్సి వస్తుందని, అందుకు తనకు ఒక రోజు సెలవు ఇవ్వాలని కమిషనర్ ను మేనేజర్ కోరారు. దీంతో కమిషనర్ నువ్వు ఏ కారణంతో హైదరాబాద్ సీడీఎంఏ కు వెళ్తున్నావో నాకు తెలుసునని కావాలనే నన్ను పక్కనపెట్టి ఇన్చార్జి కమిషనర్ గా నువ్వు ప్రయత్నిస్తున్నట్లు నాకు తెలుసునని కమిషనర్ కోపంగా అన్నారు.
మేనేజర్ హయ్యూమ్ వివరణ:
అలాంటిది ఏమీ లేదని తన భార్య ఆరోగ్యం బాగా లేనందువల్లే చికిత్స కోసం హైదరాబాద్ వెళుతున్నానని కమిషనర్ ను మేనేజర్ హయ్యూమ్ సముదాయించారు. అసలు తనకు ఎలాంటి దురుద్దేశం లేదని తాను ఇన్చార్జి కమిషనర్ ఇచ్చిన చేసే పరిస్థితిలో లేనని తాను చేయబోనని, ఈ విషయం కౌన్సిల్ సభ్యులకు కూడా చెప్పానని ఖరండిగా మేనేజర్ తేల్చి చెప్పారు. ఈ రద్దంతానికి ముఖ్య కారణం ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనర్ పై స్థానిక కౌన్సిల్ సభ్యులు అసంతృప్తితో ఉన్నారని, పార్టీ ముఖ్య నేతలకు కమిషనర్ ను తొలగించి ఇన్చార్జి కమిషనర్ గా మున్సిపల్ మేనేజర్ ను నియమించాలని ప్రతిపాదిస్తున్నట్లుగా ఊహాగానాలు చెక్కర్లు కొట్టడంతో తన కమిషనర్ సీటుకు మున్సిపల్ మేనేజర్ ఎక్కడ ఎసరు పెడుతున్నాడో అన్న అక్కసుతో తనపై కావాలనే అసభ్యకర పదజాలం వాడుతూ ఆరోపణలు చేస్తున్నారని మేనేజర్ కమిషనర్ ను నిలదీశారు.
మున్సిపల్ కార్యాలయంలో తాను కష్టపడి పనిచేసిన తనను గౌరవించడం లేదని, తన పనిని గుర్తించడం లేదని తనను కావాలనే కమిషనర్ వేధిస్తున్నారని మేనేజర్ కన్నీటి పర్యంతమయ్యరు. వాస్తవానికి తన భార్యకు క్యాన్సర్ రావడంతో చికిత్స నిమిత్తం తాను హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం వస్తుందని, అందుకే తాను ఒక రోజు సెలవు మంజూరు చేయమని ప్రాధేయపడుతున్నట్లు చెప్పాడు. ఇదేమి తనకు పట్టనట్లుగా ఇన్చార్జి కమిషనర్ కోసమే హైదరాబాదులోని డిఎం ఆఫీస్ కి వెళ్లి కలుస్తున్నావని మేనేజర్ పై కమిషనర్ గట్టిగా అరిచారు. ఒకానొక దశలో కమిషనర్ నోట్లో నుంచి బూతు మాటలు దొర్లాయి. తనను ఎవరు ఏం చేయలేరని, తన వెంట్రుక కూడా పీకలేరని, మేనేజర్ పై కమిషనర్ గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న కౌన్సిల్ సభ్యులు నివ్వేరపోయారు. తనను కావాలని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మేనేజర్ వాపోయారు.
ఒకరి పై ఒకరు అవినీతి ఆరోపణలు:
తన భార్యకు చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్తానని సెలవు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే ఒక్కరోజు సెలవు ఇవ్వడం కుదరదని ఖరాఖండిగా చెప్పి మేనేజర్ గా గతంలో నువ్వు ఇన్చార్జి కమిషనర్ గా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడి అక్రమంగా కేటాయించిన ఇంటి నెంబర్ల చిట్టా బయటపెట్టి నిన్ను సస్పెండ్ చేయిస్తానని మేనేజర్ పై తారస్థాయిలో కమిషనర్ ధ్వజమెత్తారు. అదే స్థాయిలో మేనేజర్ మాట్లాడుతూ ప్రస్తుత కమిషనర్ వాడుకుంటున్న కారు ఈఎంఐ కూడా మున్సిపల్ నిధుల నుండి చెల్లిస్తూన్నారని, కారును నడిపే డ్రైవర్ వేతనాన్ని కూడా వాటర్ సెక్షన్ విభాగం నుండి అక్రమంగా బిల్లులు చూయిస్తూ నెలసరి జీతాలు పొందుతున్నాడని కౌన్సిల్ సభ్యుల ఎదుటే మేనేజర్ చెప్పారు. అక్కడే ఉన్న కొంతమంది మీడియా ప్రతినిధులు వారిద్దరి సంభాషణలను ఫోటో తీయడానికి ప్రయత్నించగా ఎలాంటి రికార్డులు చేయకూడదని కమిషనర్ డ్రైవర్ మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగడం కోసమెరుపు. కమిషనర్ చాంబర్లోకి ఎవరిని నేను అనుమతించనని చెబుతూ డ్రైవర్ అడ్డుకోవడం పై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతి చిట్టా బయటపెడ్తా:
కౌన్సిల్ సభ్య సర్వసభ్య సమావేశం కూడా కావాలనే కమిషనర్ వాయిదా వేస్తూ కాలయాపన చేస్తున్నాడని మేనేజర్ ఆరోపించారు. తర్వాత జరగబోయే కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో కమిషనర్ చేసిన అవినీతి ఆరోపణలు రుజువుతో సహా అవినీతి చిట్టాను బయటపెడతానని మేనేజర్ వెల్లడించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకోవడంతో అక్కడే ఉన్న ఎంఐఎం కౌన్సిలర్ భర్త జహీర్ అలీ మేనేజర్ ను పక్కకు తీసుకెళ్లారు. మున్సిపల్ కార్యాలయంలో ఇరువురి మధ్య జరుగుతున్న వాగ్వివాద సమయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను తో పాటు 5 వార్డు కౌన్సిలర్ ప్రసాద్, 9వ వార్డు కౌన్సిలర్ కవిత కాశీరాం, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.