Complaint against cut palm trees: ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 2( ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం కొట్టార్మూర్ లోని తాటి చెట్లను నరికివేసి తమ జీవనోపాధి దెబ్బతీసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కొటార్మూర్ గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఆర్మూర్ ఎక్సైజ్ ఎస్సై ప్రభాకర్ కు బుధవారం ఫిర్యాదు చేశారు. కొటార్మూర్ లోని విశాఖ కాలనీలో తమ సంఘానికి సంబంధించిన చెట్లలో నాలుగింటిని విశాఖ గంగారెడ్డి అనే వ్యక్తి మంగళవారం నరికేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
చెట్లను కొట్టివేయడంతో తమ జీవనోపాధి దెబ్బతిన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేపట్టి సదరు వ్యక్తి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు టి. నరేశ్ గౌడ్, సభ్యులు సాగర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ గౌడ్, శ్రీధర్ గౌడ్, మహేందర్ గౌడ్, టి.నర్సాగౌడ్, జి. లక్ష్మీ నారాగౌడ్, నాగుల రాజేశ్వర్ గౌడ్, కిషోర్ గౌడ్, కె.జనార్దన్ గౌడ్ సభ్యులు పాల్గొన్నారు.