CM Bumper Offer: హైదరాబాద్, ఆగస్టు 16 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు మరో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు. ఈపాటికే సంచలన నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు త్వరలోనే మరో తీపి కబురు అందించనుంది. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మాఫీ అందజేసే మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలనాత్మక నిర్ణయంతో అడుగు ముందుకు వేస్తుంది.
రైతు భరోసా డబ్బులను వానాకాలం పంటలకు అందిస్తామని మంత్రులు పదేపదే చెబుతున్న మాట ఇప్పుడు నిజం కాబోతోంది. దాదాపుగా విధివిధానాలు ఈ నెలాఖరు చివరి వరకు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. కానీ ప్రభుత్వం నుండి రైతుభరోసా పథకంపై ఎలాంటి అధికారిగా ప్రకటన వెలువడకపోయినా రానున్న రోజుల్లో రైతు భరోసా పై క్లారిటీ రానున్నట్లు సమాచారం.
రెండు లక్షల రుణమాఫీతో రైతుల కళ్ళల్లో సంతోషం కనబడుతున్న ఆనంద సమయంలో రైతు భరోసా అందజేస్తామన్న మరో మాట రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న మరో కానుక. ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగానే మూడు విడతల్లో రైతుల బ్యాంకు అకౌంట్లో రుణమాఫీ డబ్బులను జమ చేశారు.
జూలై 18న తొలి విడతలో లక్ష రూపాయల రుణమాఫీ చేయగా, 31న ఒకలక్ష 50 వేల లోపు రైతులకు రుణమాఫీ అందింది. మొదటీ నుండి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అందిస్తామన్న మాట రేవంత్ రెడ్డి సర్కార్ నిలబెట్టుకుంది. ఈ పథకం రైతులకు ఆనందాన్ని కలగజేసింది. రైతు రుణమాఫీ పథకంపై ప్రతిపక్షాలు విమర్శనస్త్రాలు గుప్పించిన రాష్ట్ర మంత్రివర్గం ఖండిస్తూనే వచ్చారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ మాటనే నిజమైంది. రైతు భరోసా డబ్బులను రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది అన్న ప్రతిపక్షాల వాదనలను ప్రభుత్వం ఖండించింది. అలాగే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు తిప్పి కొట్టడానికి రైతు భరోసా డబ్బులను అనర్హులకు కాకుండా అర్హులైన రైతులకు అందే విధంగా సర్కార్ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది