Job Mela: పదవ తరగతి పాస్ అయితే చాలు. ఎక్కువ చదువుకున్నా కూడా సమస్య ఏమి లేదు. ఈజీగా జాబ్ వస్తుంది. ఎటువంటి పరీక్ష లేకుండా ఉద్యోగం వస్తుంది. విశాఖపట్నం జిల్లా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అధికారి చాముండేశ్వరి విశాఖపట్నం జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్ లో మార్చి 25న మెగా జాబు మేళా నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఈ జాబ్ మేళాలో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కంప్లేస్మెంట్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు అని తెలిపారు. నైపుణ్యం కలిగిన మెకానిక్స్ ను ఈ ఇంటర్వ్యూలో తీసుకుంటారని తెలిపారు.
ఈ జాబ్ కు సంబంధించి విద్యార్హతలు ఈ విధంగా ఉండాలి. పదవ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, బీటెక్, ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఉత్తీర్ణత ఉన్న నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని తెలిపారు. వయసు పరిమితి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 9988853335, 8712655686, 8790118349, 8790117279 నెంబర్ ని సంప్రదించాలని కోరారు.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
అభ్యర్థులు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలియజేశారు. ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులు naipunyam.ap.gov.in వెబ్సైట్ లో తమ పేరును నమోదు చేసుకొని మార్చి 25, 2025 మంగళవారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా కోరారు. నిరుద్యోగ యువతీ యువకులు అవకాశము ఉన్నంతవరకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు. అయితే అధిక సంఖ్యలో పలు కంపెనీలను తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ఇప్పటివరకు చాలామంది నిరుద్యోగులకు మెగా జాబ్ మేళ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.