RBI Repo Rate Cut: ప్రతి నెల లోన్ ఈ ఎం ఐ చెల్లించే వారి కోసం తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గుడ్ న్యూస్ తెలిపింది. రెపోరేటు ను తగ్గిస్తున్నట్లు ఆర్బిఐ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రతినెల లోన్ ఈఎంఐ కట్టే వారికి భారీ ఊరట లభిస్తుంది. దేశీయ కేంద్ర బ్యాంక్ విజయ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ద్రవ్య విధానం కమిటీ సమీక్షలో ఆర్బిఐ రెపోరేటును తగ్గిస్తూ ఒక కీలక నిర్ణయం ప్రకటించింది.
పాలసీ రెపోరేట్లో 25 బేసిస్ పాయింట్ల కోతను ఆర్బిఐ విధించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఆర్బిఐ ఎంపీసీ మొదటి సమావేశం ఇది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పరసుంకాలను అమలులోకి తెచ్చిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మేరకు రిపోర్టును తగ్గించడం గమనించవచ్చు.
తాజాగా రెపోరేటును ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఈ క్రమంలో 6.5% ఉన్న రెపోరేటు ఆరు శాతానికి దిగి వచ్చింది. వీటితోపాటు ఎస్డిఎఫ్ రేటును 5.75 శాతానికి అలాగే ఎంఎస్ఎఫ్ రేటును 6.5 శాతానికి తగ్గించడం జరిగింది.
గతంలో కూడా ఫిబ్రవరి నెలలో ఎంపీసీ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో రిపోర్టు 6.25 శాతానికి దిగి వచ్చింది. మే నెల 2020 తర్వాత ఇది మొదటి తగ్గింపు అని తెలుస్తుంది. రెండున్నర సంవత్సరాల తర్వాత మొదటి సవరణ జరిగింది. తాజాగా మళ్లీ రెపోరేటు లో ఆర్బిఐ కోత విధించింది.
ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి తగ్గింపు మరియు ఈ ఏడాదిలో రెండో రేటు కోత కావడం విశేషం. ప్రస్తుతం ద్రవయోల్బణం నియంత్రణలో ఉండటం మరియు ట్రంపు విధించిన సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర సవాళ్లను కలిగిస్తున్న సమయంలో వృద్ధిని ప్రేరేపించాల్సిన అవసరం ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది అని తెలుస్తుంది.