Pahalgam Terrorist Attack: బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగ ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞానిగా బాగా గుర్తింపు చెందారు. చాలా సందర్భాలలో బాబా వంగ చెప్పిన జోస్యం నిజం అయింది. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజం అవడంతో చాలా సందర్భాలలో ఆమె వార్తల్లో కూడా నిలిచారు. బల్గేరియన్ సైకిక్ బాబావంగాను నోస్ట్రాదామస్ ఆఫ్ ది బాల్కన్స్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ యుగంలో ఆమె చెప్పిన ప్రవచనాలు ప్రసిద్ధి చెందడం, అవి నిజమవుతుండడం సామాజిక మాధ్యమాలలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన పహాల్గాం దాడి తర్వాత బాబా వంగ జోష్యం గురించి మరోసారి చర్చ జరుగుతుంది.
అందమైన కాశ్మీర్ లో ముష్కరులు అమాయకుల ప్రాణాలే టార్గెట్గా అత్యంత దారుణంగా 28 మంది ప్రాణాలను తీశారు. ఈ ఘటనలో చాలా మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా షాక్కు గురి చేసింది. యావత్ దేశం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో భారత్ కూడా పాకిస్తాన్ దేశంపై ఆంక్షలు విధించింది. భారత ఉగ్రవాదుల ఏరివేత తో పాటు కేంద్ర ప్రభుత్వం పలు కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. పహాల్గంలో జరిగిన విధ్వంసరావు ఉగ్రవాద దాడి తర్వాత మరోసారి బాబా వంగ ప్రవచనాలు సామాజిక మాధ్యమాలలో తెరపైకి వచ్చాయి. రీసెంట్ గా పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన ఈ క్రూరమైన దాడిని 1996లో మరణించిన బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త అంచనాలను ఆమె ప్రవచనాలను తిరిగి గుర్తుచేసుకునేలాగా చేస్తున్నాయి.
బాబా వంగ ప్రవచనాల ప్రకారం 2043 నాటికి ప్రపంచ ఇస్లామిక్ ఆధిపత్యాన్ని అంచనా వేయడం జరిగింది. ఆమె ప్రవచనాలలో 2043 నాటికి యూరప్ లో సమాజం ఒక గొప్ప రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతుందని పేర్కొనబడింది. వివిధ వివరణల ప్రకారం బాబావంగా 2025 నుంచి ఒక పెద్ద సంఘర్షణ మొదలయ్యి అది వినాశనానికి దారితీస్తుందని అప్పట్లో ఆమె అంచనా వేశారు. బాబా వంగ ముందే ఊహించినట్లుగా 2025లో ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొంటుందని, యూరోప్ లో పెద్ద ఘర్షణలు కూడా ఉంటాయని తెలుస్తుంది.