Arundhati: అనుష్క కెరియర్లో ఇప్పటివరకు చేసిన సూపర్ హిట్ సినిమాలలో అరుంధతి సినిమాకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. అరుంధతి సినిమాతోనే అనుష్క క్రేజ అమాంతంగా పెరిగిపోయింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. అనుష్క శెట్టి ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అప్పటివరకు కమర్షియల్ సినిమాలలో హీరోయిన్గా నటించిన అనుష్క ఈ సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు అడుగు వేసింది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో సోనూసూద్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పశుపతి పాత్రలో సోను సూద్ నటన ప్రేక్షకులను బాగా భయపెట్టగలిగింది.
ఇది ఇలా ఉంటే అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో కనిపించిన అమ్మాయి ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. అమ్మాయి పేరు దివ్య నగేష్. దివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. 2014లో రిలీజ్ అయిన తమిళ చిత్రం శైవంతో దివ్య మొదటిసారిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దివ్య అరుంధతి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అరుంధతి చిన్నప్పటి పాత్రలో తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివ్య నగేష్.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
దివ్య నగేష్ కెరియర్ లో అరుంధతి సినిమా మర్చిపోలేని సినిమాగా నిలిచిపోయింది. ఇప్పటికీ కూడా అరుంధతి సినిమా టీవీలో ప్రసారమైతే చాలామంది ప్రేక్షకులు ఇష్టంగా చూస్తారు. ప్రస్తుతం దివ్యా నగేష్ హీరోయిన్గా కూడా సినిమాలలో నటిస్తుంది. మలయాళం లో దివ్య పలు సినిమాలలో హీరోయిన్గా చేసింది. తెలుగులో దివ్య నగేష్ నేను నాన్న అబద్ధం అనే సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది. తాజాగా దివ్య నాగేష్ కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram