TS 10th Results 2025: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ టెన్త్ ఫలితాలను విడుదల చేయడానికి టెన్త్ బోర్డు రంగం సిద్ధం చేసింది. విద్యాశాఖ మరో రెండు రోజుల్లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పరీక్షల విభాగం టెన్త్ రిజల్ట్స్ తేదీని ఖరారు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం పొందిన వెంటనే విద్యాశాఖ టెన్త్ క్లాస్ ఫలితాలను విడుదల చేయనుంది. త్వరలోనే అధికారికంగా టెన్త్ క్లాస్ విడుదల తేదీ కూడా ప్రకటించనున్నారు. ఆ తర్వాత వెంటనే తెలంగాణ రాష్ట్ర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ 2025 కూడా విడుదల చేయనున్నారు.
పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు త్రిపుల్ ఐటి లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎస్ఎస్సి బోర్డు అధికారిక వెబ్సైట్ అయిన https://bse.telangana.gov.in/ లో అలాగే https://www.manabadi.co.in లో ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలు వాళ్ల భవిష్యత్తుకు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. పదవ తరగతి కెరీర్ పునాదికి ఎంతో కీలకమైనది. అందుకే విద్యార్థులందరూ మరియు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు అంటే ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. టెన్త్ క్లాస్ పరీక్షలు పాసైన తర్వాత విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి పలు ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. అందుకే ప్రతి ఒక్క విద్యార్థికి పదవ తరగతి ఫలితాలు పై ఎంతో ఉత్కంఠ నెలకొంటుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.