Traffic Police: తాజాగా ప్రభుత్వం వాహనదారులకు ఒక హెచ్చరికను జారీ చేసింది. మీరు పొరపాటున కూడా ఈ తప్పు చేస్తే మీ వెహికల్ ఆర్ సి రద్దు చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలి. లేకపోతే వాళ్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాహనదారులు రూల్స్ బ్రేక్ చేయకుండా ఉంటే బెటర్. ఇటీవల హైదరాబాద్ పోలీసులు ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 22 వరకు నిర్వహించిన మైనర్ డ్రైవింగ్ ప్రత్యేక డ్రైవ్ లో మొత్తం 1275 కేసులను నమోదు చేశారు.
అందులో పట్టుబడిన 35 వాహనాల రిజిస్ట్రేషన్ ఒక ఏడాది పాటు రద్దు కూడా చేశారు. అలాగే మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఆ మైనర్లకు 25 సంవత్సరాల వయసు వచ్చేవరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా నిషేధం కూడా విధిస్తున్నారు. కాబట్టి వాహనదారులు కచ్చితంగా రూల్స్ పాటించాలి. మైనర్లకు మాత్రం పొరపాటున కూడా వెహికల్ ఇవ్వకూడదు. ట్రాఫిక్ ప్రమోటర్ వాహనాలు చట్టం 1988 లోని సెక్షన్ 199a ప్రకారం మైనర్లు వాహనాలను నడపడం నిషేధం.
ఈ విషయాన్ని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి జోయల్ డేవిస్ తెలిపారు. ఒకవేళ మైనర్లు వాహనం నడిపితే ఆ మైనర్లతో పాటు వారి సంరక్షకులు లేదా ఆ వాహన యజమానులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు తప్పవని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు డ్రైవ్ చేస్తున్న సమయంలో మైనర్లు ఉపయోగించే అన్ని వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేయాలని ప్రాంతీయ రవాణా అథారిటీకి తమ అభ్యర్థనను సమర్పించారు. అయితే ఈ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ రూల్స్ ను అందరూ పాటించడం ద్వారా రోడ్డు భద్రతను నిర్ధారించడంలో ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.