:-ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్
Agricultural Market: ఆర్మూర్ టౌన్, డిసెంబర్ 9 (ప్రజా శంఖారావం): రైతుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతూ, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తామని ఆర్మూర్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. సోమవారం నూతనంగా ఎన్నుకోబడిన ఆర్మూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ఆధ్వర్యంలో రైతుల అభివృద్ధి కోసం అన్ని విధాల పాటుపడుతూ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి దిశగా పాటుపడతామని ఆయన వెల్లడించారు.
ఆయన నియామకానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ మాణాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యదర్శి భారతి నూతన కార్యవర్గ సభ్యులను పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విట్టం జీవన్, మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఏవో హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.