ACB TRAP: వెబ్ డెస్క్, ఆగస్టు 13 (ప్రజా శంఖారావం): తనకు న్యాయం చేయాలంటూ తన పేరుపై ఉన్న 14 గుంటల భూమి ధరణి పోర్టల్లో ప్రొబిటెడ్ లిస్టులో ఉందని అది తొలగించి సహాయపడాలంటూ రైతు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అధికారిని సంప్రదించాడు. న్యాయం చేస్తాడని ఆశ్రయిస్తే సదరు అధికారి నజరానా ముట్టజెప్పాల్సిందని డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ముత్యం రెడ్డి తాను ఇస్తానన్న 8 లక్షల రూపాయలు అడిషనల్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న మదన్ మోహన్ రెడ్డికి ఇచ్చేందుకు మంగళవారం కార్యాలయానికి వెళ్ళాడు.
ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు:
బాధితుడు ముత్యం రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరాడు. పక్క స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి లను వలపన్ని పట్టుకున్నారు. బాధితుని నుండి రెడ్ హ్యాండెడ్ గా కారులో డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు మదన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు.
న్యాయం చేయాలంటూ కార్యాలయానికి వచ్చిన బాధితుల నుండి 8 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ ను అరెస్టు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఒక ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా బాధితులను ఇబ్బందులకు గురిచేసి డబ్బులు డిమాండ్ చేయడం పై నిటిజన్లు మండిపడుతున్నారు