ACB Trap: మెట్ పల్లి, మార్చి 5 (ప్రజా శంఖారావం): ఏసీబీ అధికారులకు చిక్కిన అవినీతి తిమింగలం. కోరుట్ల ఎస్సై -3 గా విధులు నిర్వహిస్తున్న శంకర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్ వద్ద పేకాట విషయంలో పట్టుబడ్డ సెల్ ఫోన్ ఇవ్వడానికి ఎస్సై బాధితుని వద్ద 5వేల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు.
బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ డిఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో బాధితునితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. బాధితునీ నుండి ఎస్సై పోలీస్ స్టేషన్ గేటు ఎదురుగా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now