Womens Scheme: మహిళల కోసం ప్రభుత్వం మహిళా సమ్మన్ సేవింగ్స్ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీంలో సంవత్సరానికి 7.5% వడ్డీ వర్తిస్తుంది. మూడు నెలలకు ఒకసారి చక్రవడ్డీ కింద అందిస్తారు. ఈ క్రమంలో రెండు సంవత్సరాలు పూర్తయ్యేసరికి 16% రిటర్న్స్ లభిస్తాయి. సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ లలో మరియు ఇతర పథకాలలో 10 శాతం కంటే తక్కువ వడ్డీని అందిస్తారు. అంతకంటే ఎక్కువ వడ్డీ పొందాలంటే రిస్క్ తీసుకోవాలి. కానీ అటువంటి అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఒక సూపర్ పథకాన్ని తీసుకొచ్చింది.
ఆ పథకాన్ని మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అంటారు. ప్రభుత్వం అందిస్తున్న మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకంలో సంవత్సరానికి 7.5% వడ్డీ అందిస్తారు. మూడు నెలలకు ఒకసారి చక్రవడ్డీ కింద లెక్కేస్తారు. రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి 16% వరకు రిటర్న్స్ వస్తాయి. ఇతర చిన్న చిన్న పథకాలు మరియు ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే పథకాలలో మహిళలకు ఇంత ఎక్కువ రాబడి ఉండదు. ఈ పథకంలో రెండు లక్షలు పెట్టుబడి పెడితే అది రు.2,32,044 ఉంటుంది.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
రూ.32,044 లాభం మీకు వస్తుంది. అదే ఒకవేళ లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీగా మీకు రూ.1,16,022 గా ఉంటుంది. రూ.16,022 వడ్డీ మీ ఖాతాలో జమ చేస్తారు. కనీసం వెయ్యి రూపాయలు ఈ పథకంలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తర్వాత 100 గుణిజాల్లో ఎంతైనా పెంచుకుంటూ వెళ్లొచ్చు. ఒక్కో ఎకౌంటు ఉన్నవాళ్లు గరిష్టంగా రెండు లక్షల వరకు పెట్టుబడి చేసుకోవచ్చు. ఒక మహిళ లేదా బాలిక సంరక్షకుడు మొదటి ఖాతా తెరిచిన మూడు నెలల తర్వాత రెండో ఖాతాను కూడా తెరవవచ్చు. మెచ్యూరిటీ తర్వాత మీ డబ్బులు మీకు అందుతాయి.