Viral Video: ఇంటి గేటు ముందు అర్ధరాత్రి ఏదో చప్పుడు అయింది. అర్థరాత్రి వింత ఆకారంతో గేటు పై నుండి ఇంట్లోకి వచ్చే సాహసం చేసింది. తర్వాత ఇంటి వెనకాలకి పోయింది. ఈ సంఘటన ఏప్రిల్ 23న తెల్లవారు సమయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీ టీవీ కెమెరాల్లో బందియ్యాయి. ప్రస్తుతం ఇప్పుడు ఈ దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అవి ప్రాంతంలో నివసించే చోట జంతువులు తిరగడం మామూలే.
ఇలాంటి సంఘటనలకు సంబంధించిన దృశ్యాలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పులులు, ఏనుగులు, వింత అడవి జంతువులు రావడం సర్వసాధారణమైపోయింది. కొన్ని సందర్భాల్లో ఆస్తి నష్టం కూడా వాటిల్లుతుంది. రాత్రి సమయాల్లో కావడంతో ఇంటి బయట వచ్చిన ఆఖరాన్ని చీకట్లో గుర్తుపట్టడం కాస్తంత కష్టమే. అలాంటి వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
హిమాచల్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఓ ఇంట్లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. సిసి కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలిస్తే అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ఎలుగుబంటి చొరబడ్డట్లు కనబడుతుంది. కాసేపు ఆ ఇంట్లో అటు ఇటు వాకింగ్ చేసి ఇంటి వెనుక సైడు వెళ్ళింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం ప్రస్తుతం జరగకపోయినా సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చూసి ఇంటి యజమానులు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు. ఎలుగుబంటి గేటు పై నుండి వచ్చి తిరిగిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
#ViralVideo: అర్ధరాత్రి గేటు వద్ద వింత ఆకారం pic.twitter.com/SSKTWVVPSP
— Prajashankaravam (@Prajashanka) April 26, 2025