UPI: చాలామంది యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఒక గుడ్ న్యూస్. వాళ్లు త్వరలో తమ బ్యాంక్ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. ప్రస్తుతం ఉన్న యూపీఐ లైట్ వినియోగదారులకు కేవలం వారి వాలెట్లో డబ్బులు లింక్ చేసుకోవడానికి మాత్రమే అనుమతిని ఇస్తుంది. కానీ బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బును ఉపసంహరించడానికి ఎటువంటి ఆప్షను ఇప్పటివరకు లేదు. తమ బ్యాలెన్స్ను యాక్సెస్ చేయాలనుకుంటే వినియోగదారుడు యూపీఐ లైటును నిలిపివేయాల్సి ఉంటుంది. మిగిలిన నిధులు ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాకు జమ చేయబడతాయి. ప్రస్తుతం వచ్చిన కొత్త ట్రాన్స్ఫర్ అవుట్ ఫీచర్ దీనిని మారుస్తుంది.
ఈ కొత్త ఫీచర్ వలన వినియోగదారులు యూపీ లైట్ను నిలిపివేయకుండా తమ బ్యాలెన్స్ను ఉపసంహరించి వాళ్ళు లింకు చేసిన బ్యాంకు ఖాతాకు తిరిగి బదిలీ చేయవచ్చు. ఈ లావాదేవీలను గుర్తించేందుకు ఎంపీసీఐ పర్సన్ కోడ్ 46 ను కేటాయించడం జరిగింది. లైట్ రిఫరెన్స్ నెంబర్ బ్యాలెన్స్లను బ్యాంకు లు నిర్వహించాలి. అలాగే ప్రతిరోజు ఎన్పీసీఐ డేటాతో సమన్వయించాలి. యూపీఐ యాప్ లలో యూపీఐ లైఫ్ లో వినియోగించేటప్పుడు యాప్ పాస్ కోడ్లు, బయోమెట్రిక్ ప్రమాణీకరణ, పాటర్న్ లాక్ లు అవసరమవుతాయి. అనవసరమైన పేమెంట్స్ ను నివారించడానికి ఈ చర్యను చేపట్టారు.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
వినియోగదారులు ముందుగా తమ స్మార్ట్ ఫోన్లో యూపీఐ యాప్ ను ఓపెన్ చేసి యూపీఐ లైటును ప్రారంభించడానికి ఆప్షన్ను ఎంచుకోవాలి. నిబంధనలను అంగీకరించి జోడించడానికి కావాల్సిన మొత్తం నమోదు చేయాలి. లింకు చేసిన బ్యాంకు ఖాతాను ఎంచుకొని యూపీఐపి తో అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. వాళ్లు యూపీఏ లైట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని తమ యూపీఐ ఖాతాకు లేదా లింక్ చేసిన బ్యాంకు ఖాతాకు తిరిగి పంపించుకోవచ్చు. ఆర్థిక నిర్వహణను ఇది సులభతరం చేస్తుంది. వినియోగదారుల అనుభవాన్ని ఈ ఫీచర్ మెరుగుపరుస్తుంది. యూపీఐ లైన్ ను మరింత సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.