GO RELEASE: ఆలయానికి 50 లక్షల నిధులు మంజూరు చేయించిన వినయ్ రెడ్డి
నందిపేట్, ఏప్రిల్ 28 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిద్ధాపూర్ గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి దేవదాయ శాఖ నుండి 50 లక్షల రూపాయల నిధులను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గ్రామ కమిటీ విజ్ఞప్తి మేరకు మంజూరి చేయించారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన జీవో పత్రాన్ని సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కమిటీ సభ్యులకు అందజేశారు.
గ్రామములోని ఆలయానికి నిధులు మంజూరు చేయాలని అడగగానే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు లను సంప్రదించి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేసిన మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డిలకు గ్రామస్తులు, గ్రామ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.