Tollywood: తెలుగు సినిమాల్లో ప్రస్తుతం ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండింగ్ నడుస్తోంది. గత పదేండ్ల కిందట ఆపై తీసిన సినిమాలను ప్రస్తుతం రీ రిలీజ్ చేస్తున్నారు. ఇలా రీ రిలీజ్ చేసిన సినిమాలు కూడా మంచి కలెక్షన్లను సాధించి నిర్మాతలకు లాభం చేకూరుస్తున్నాయి. ఒకప్పుడు హిట్ సినిమాలే కాకుండా అప్పట్లో అంతగా నడవని మూవీలను కూడా ఇప్పుడు ధైర్యంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా వరకు సక్సెస్ అవుతున్నారు.
కృష్ణవంశీ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా.. సోనాలి బింద్రే కథానాయికగా విడుదలైన చిత్రం మురారి. ఇందులో పాటలు, కథ తెలుగు ప్రేక్షకులను ఆకట్టకుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం తెగ ఎంజాయ్ చేశారు. మురారి మూవీ మహేశ్ బాబు సినీ కెరీర్ లో కీలక మలుపు అని చెప్పొచ్చు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఈ ఏడాది మళ్లీ రీ రిలీజ్ చేసింది. దీంతో మురారి మూవీ దాదాపు రూ. 8.5 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించుకుంది. ఈ సినిమాను రీ రిలీజ్ చేసే సమయంలో ఇంత కలెక్షన్లు వస్తాయని అస్సలు ఊహించకపోయి ఉండొచ్చు.
దీంతో చాలా తెలుగు సినిమాలను రీ రిలీజ్ చేశారు. అందులో ఆరెంజ్, ఖుషీ, ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గబ్బర్ సింగ్, ఖుషీ, ఆర్య 2, బిజినెస్ మ్యాన్, సింహాద్రి, సూర్య సన్నాప్ కృష్ణన్, జల్సా, ఇంద్ర మూవీలు సూపర్ గా రీ రిలీజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇందులో మొదటి సారి విడుదల చేసిన సమయంలో బ్లాక్ బ్లస్టర్లు ఉంటే కొన్ని మూవీలు అసలు పెట్టుబడి రానివి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆరెంజ్ సినిమా.. విడుదలైన తర్వాత నిర్మాత నాగబాబు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ ఆరెంజ్ రీ రిలీజ్ లో దాదాపు. 4.5 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కానీ ఆరెంజ్ మూవీ.. పాటలతో మాత్రం ఎప్పటికీ గుర్తిండిపోయింది. ముఖ్యంగా రూబా రూబా సాంగ్ తో రీ రిలీజ్ తో థియేటర్ లో రచ్చ చేసిన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్ లలో గబ్బర్ సింగ్ 8 కోట్లు, ఖుషీ 7.4 కోట్లు, ఆర్య 2 మూవీ 6.7 కోట్లు వసూలు చేసి రెండు, మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి.