Todays Gold Price: మహిళలకు అదిరిపోయే న్యూస్…తగ్గుతున్న బంగారం ధరలు..
మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. కానీ గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు అందరికీ ఆందోళనకు గురిస్తున్నాయి. అయితే నాన్ స్టాప్ గా పెరుగుతూ వెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. మూడు నాలుగు రోజులే నుంచి బంగారం ధరలలో తగ్గుదల కనిపిస్తుంది. అంతర్జాతీయంగా జరిగే పరిణామాల ప్రకారం బంగారం మరియు వెండి ధరలలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. పసిడి మరియు వెండిని ప్రపంచవ్యాప్త డిమాండ్, కరెన్సీ మార్పిడి రేట్లు, వడ్డీ రేట్లు, ప్రపంచ విధానాలు, ప్రపంచ సంఘటనలు వంటివి గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం పసిడియులకు ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. భారత మార్కెట్లో గత ఐదు రోజుల నుంచి బంగారం ధరలు దిగి వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి. ఏప్రిల్ 8, మంగళవారం దేశవ్యాప్తంగా తులం బంగారం ధర రూ. 90,370 ఉంది. ఈ ధరలు ఏప్రిల్ 8, మంగళవారం ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా గుర్తించగలరు.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి, వెండి ధరలు..
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 90,370 గా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,840 గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నం నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,370 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,840 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,520 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,990 గా ఉంది.
ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,370 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,840 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,370 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,840 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,370 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,840 గా ఉంది.
అంతర్జాతీయ ప్రామాణికరణ సంస్థలు బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి హాల్ మార్కులను ఇస్తారు. 24 క్యారెట్ల పసిడి ఆభరణాలపై 999 అని అలాగే 23 క్యారెట్ల పసిడి ఆభరణాలపై 958 అని అలాగే 22 క్యారెట్ల పసిడి ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల పసిడి ఆభరణాలపై 875 అని, 18 క్యారెట్ల పసిడి ఆభరణాలపై 750 అని హాల్ మార్క్ రాసి ఉంటుంది. అయితే చాలావరకు పసిడి 22 క్యారెట్ల ఎక్కువగా అమ్ముడు అవుతుంది. మరికొంతమంది 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. 24 క్యారెట్ కు మించి ఉండకూడదు. బంగారం క్యారెట్ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంతా స్వచ్ఛంగా ఉంటుంది అని అర్థం. ఇక దేశంలోని ప్రధాన నగరాలలో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు కిలో వెండి ధర రూ.93,900 వద్ద కొనసాగుతుంది.