Zodiac Signs: ఈ రాశుల వారు ఆర్థిక విషయాలలో వీళ్లను అస్సలు నమ్మకూడదు.. ఈవారం 12 రాశుల రాశి ఫలాలు..
ఈవారం మార్చి 23 నుంచి మార్చి 29, 2025 వార ఫలాలు గురించి తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈ వారం ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బులు చేతికి వస్తుంది. అలాగే వృషభ రాశి వారికి బరువు బాధ్యతలు పెరుగుతాయి. మిథున రాశి వారికి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. మేషరాశి నుంచి మీన రాశి వరకు ఈ వారం 12 రాశుల రాశి ఫలాలు ఇవే..
మేష రాశి:
వీళ్లకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేసినా కూడా ఫలితం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఎవరితోనో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం ఉత్తమం. వృత్తి మరియు వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. మీ పనితీరుకు ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు.
వృషభ రాశి:
ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి మరియు వ్యాపారాలలో తీరిక ఉండదు. ఇంత బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు కానీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. బంధుమిత్రుల వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు.
మిథున రాశి:
ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు ఆశించిన స్థాయిలో ప్రతిఫలం కూడా ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు తప్పవు. ఆర్థికపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆదయ ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. ఆస్తి వివాదం ఓ కొలిక్కి వస్తుంది.
కర్కాటక రాశి:
ఈ వారం అంతా వీళ్ళకు అనుకూలంగా ఉంది. అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి మరియు వ్యాపారంలో బిజీగా ఉంటారు. నిరుద్యోగులకు దూరప్రాంతాల సంస్థల నుంచి ఉద్యోగ అవకాసం అందుతుంది. బంధువులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్దిగా ప్రయత్నించడంతో అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది.
సింహరాశి:
ఆదాయ ప్రయత్నాలు లాభాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది కానీ ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం ధన పరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం. వృత్తి మరియు ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. ఫలితాలు కూడా బాగుంటాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలనుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. వ్యాపారాలలో శ్రమ ఎక్కువ మరియు ఫలితం తక్కువగా ఉంటుంది.
కన్య రాశి:
ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు అందుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తి జీవితం సానుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఈ వారం అంతా ఆర్థిక విషయాలలో సానుకూలంగా ఉంది. అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. పెళ్లి ప్రయత్నాల విషయంలో దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
తులారాశి:
ఈ వారం అంతా ఉల్లాసంగా సాగుతుంది. ఆదాయం వృద్ధి చెందడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మరియు చేపట్టే ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి మరియు ఉద్యోగాలలో లక్ష్యాలను పూర్తి చేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
వృశ్చిక రాశి:
వృత్తి మరియు వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాల వలన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృధా ఖర్చులు ఇబ్బందికి గురిచేస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక విషయంలో ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
ధనస్సు రాశి:
మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి మరియు వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డబ్బు ఇతరులకు ఇవ్వడం లేదా ఇతరుల నుంచి తీసుకోవడం వంటివి పెట్టుకోకపోవడం మంచిది. ఆదాయం వృద్ధి చెందుతుంది. బాధ్యతల ఒత్తిడి పెరుగుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి. ఇతరుల బాధ్యతలను కూడా తీసుకొని ఇబ్బంది పడతారు.ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
మకర రాశి:
ఆదాయపరంగా అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. వృత్తి మరియు వ్యాపారాలలో కొత్త ఆలోచనలను చేసి ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మీ సలహాలు మరియు సూచనలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
కుంభరాశి:
ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయటపడతారు. వృత్తి మరియు ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. తల్లిదండ్రుల ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతారు. అనుకోని ఖర్చులు తప్పవు.
మీనరాశి:
ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టాలి. స్వల్పంగా అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారడానికి ఇది సరైన సమయం. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వృత్తి మరియు ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి బాగుంటుంది. కొందరు మిత్రుల వలన ఆర్థిక వ్యవహారాలలో నష్టపోయే అవకాశం ఉంది.