Kids: మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పిల్లలు.. పిల్లలు కాదు.. వీళ్లు చిచ్చరపిడుగులు.. వీళ్ళు చేసిన పనికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వీళ్ళ వయసు ఏంటి వీలు చేసిన పనేంటని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతకీ వీళ్ళు ఏం చేశారో తెలుసా..నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న నలంద హై స్కూల్ లో వీరంతా PP-2 చదువుతున్న పిల్లలు. నలంద స్కూల్ 21 వార్షికోత్సవ సంబరాలను స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి స్థానిక మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి తో పాటు మండల విద్యాశాఖ అధికారి పింజ గంగారం, ఈఅభ్యాస అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ భువనగిరి పాణి పవన్ శాస్త్రి, జబర్దస్త్ ఫేమ్ యాక్టర్స్ ఇమ్మానుయేల్ నూకరాజు, ప్రత్యూష చామంతి సీరియల్ యాంకర్, వినీత రెడ్డి జానకి రామయ్య గారి మనవరాలు ఆర్టిస్ట్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం 21 వార్షికోత్సవంలో భాగంగా డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. అన్ని తరగతుల విద్యార్థులు డ్యాన్స్ లో పార్టిసిపేట్ చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. కానీ PP-2 చిచ్చరపిడుగులు మాత్రం తమ డాన్స్ తో అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేసి ఒక రేంజ్ లో స్టెప్పులు వేశారు. చిచ్చర పిడుగుల పిల్లల స్టెప్పులకు అక్కడున్న వారంతా ఈలలు వేస్తూ గోళ గోల చేశారు.