New Ration Card: రాష్ట్రంలో ఉన్న ప్రజలకు 3 రంగుల కార్డులను పంపిణీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇదివరకే రాష్ట్రంలో ఉన్న పాత రేషన్ కార్డులను మారుస్తూ కొత్తగా 3 రంగుల కార్డులను పంపిణీ చేయాలని రాష్ట్ర సర్కార్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షం ఎంత గగ్గోలు పెట్టిన తాము తీసుకోవాల్సిన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళుతుంది రేవంత్ సర్కార్.
ఉగాది నుండి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలన్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ కొత్తగా దారిద్య రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్) వారికి ఇదివరకు ఉన్న తెల్ల రేషన్ కార్డు బదులు 3 రంగుల రేషన్ కార్డును పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ కార్డు ఉన్నవారు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాల లబ్ధి పొందేందుకు అర్హులని చెప్పవచ్చు. అలాగే దారిద్ర రేఖకు ఎగువ ఉన్న వారికి కూడా కార్డులను పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదివరకు వారి వద్ద ఉన్న గులాబీ కార్డులకు బదులు గ్రీన్ కార్డులను ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ కార్డు కలిగిన వారు కేవలం గుర్తింపు కార్డుగా ఉపయోగించడానికి మాత్రమే వీలు పడుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సబ్సిడీ పథకాలకు వీరు అర్హులు కారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఉగాది నుండి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఇదివరకే నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. కాగా సన్న బియ్యం పంపిణీకి పూర్తి ఏర్పాట్లు కానందున మే నెల నుంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేయునట్లు సమాచారం. త్వరలోనే రాష్ట్ర ప్రజలకు డిజిటల్ కార్డుల రూపంలో రేషన్ కార్డులను పంపిణీ జరగనుందని సమాచారం.