Swachh Survekshan2025: మెట్ పల్లి,మార్చి 13 (ప్రజా శంఖారావం): తడి, పొడి, హానికరమైన చెత్త సేకరణ గురించి పట్టణ వాసులకు మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించారు. మెట్పల్లి పట్టణ కేంద్రంలోని 13వ వార్డులో నిఖిల్ భారత్ హైస్కూల్ లో ప్రజలకు మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఉదయం వార్డులలోకి వచ్చే మున్సిపల్ చెత్త సేకరణ వాహనాల్లో అందజేయాలని, ఎక్కడపడితే అక్కడ చెత్తను వేయకూడదని స్థానికులకు ఆయన వివరించారు. వార్డులలోకి వచ్చే చెత్త సేకరణ వాహనాల్లో తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం, పరిశుభ్రత, స్వచ్ఛత కోసం మున్సిపల్ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని, వారికి పట్టణవాసులు కూడా సహకరించాలని కోరారు.
వార్డులలో శానిటేషన్, మురికి కాలువల సమస్య ఉంటే ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించినట్లయితే, తమ సిబ్బంది వార్డు సమస్యలను పరిష్కరిస్తారని ఆయన చెప్పారు. 2204 సంవత్సర నుండి స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే ప్రారంభమైందని, పారిశుద్ధ్య పనులకు సంబంధించి పట్టణవాసులు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, ప్రిన్సిపాల్ మహర్షి, శానిటేషన్ జవాన్లు అశోక్, నరేష్, నర్సయ్య, విద్యార్థిని విద్యార్థులు, వార్డు ప్రజలు, అధ్యాపకులు పాల్గొన్నారు.