Election Commission: తాజాగా ఈసీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు మరియు నకిలీ ఓటర్ కార్డులు అలాగే ఓటర్ల సంఖ్యలో పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలపై విపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. పార్లమెంటులో సైతం ఈ విషయంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఎన్నికల సంఘం ఓటర్ డేటా లో ఉన్న నకిలీ ఓటర్ నెంబర్లకు సంబంధించి పలు పార్టీల ఆందోళనలపై చర్చించడానికి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం కీలకమైన నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లను సక్రమంగా గుర్తించేందుకు ఓటర్ల జాబితాతో ఆధార్ మరియు ఫోన్ నెంబర్లను అనుసంధానం చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఈసీఐ ఎన్నికలను జాతీయ సేవా తొలి అడుగుగా అభివర్ణించిన తన రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించడానికి ఏమాత్రం వెనకడుగు వేయదని ఈ క్రమంలో స్పష్టం చేశారు. ఎన్నికల అధికారులకు జనన మరియు మరణాల నమోదు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించడం జరిగింది.
ఓ జాతీయ పత్రిక నివేదనల ప్రకారం భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలోని ప్రధాన ఎన్నికల అధికారులకు పంపిణీ చేసిన నోట్ ప్రకారం ఆధార్ నెంబర్లను ఓటర్ల జాబితా డేటాతో అనుసంధానించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే అధికారులు ఇంటింటి సర్వేలు నిర్వహించేటప్పుడు బూత్ లెవెల్ అధికారులందరూ రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులందరికీ తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకునేలా చూడాలని సిఇసి ఆదేశించడం జరిగింది. ఓ ఆంగ్ల పత్రిక ఈ మేరకు ఈ నెల నాలుగున నిర్వహించిన సీఈఓ కాన్ఫరెన్స్లో ఓపెన్ రిమార్క్ ఆఫ్ సిఈసి పేరిట సీఈఓ లందరికీ పంపిణీ చేసిన పత్రాలలో ఇవే ఆదేశాలు ఉన్నాయని అలాగే ఆదేశాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సర్కులర్ చేయాలని సీఈఓ లకు నిర్దేశించినట్లు పేర్కొంది.