BJP: కుకునూరుపల్లి, మార్చి 12 (ప్రజా శంఖారావం): సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన బైరి శంకర్ ముదిరాజ్ ను కుకునూరుపల్లి మండల బిజెపి అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. బుధవారం కుకునూరు పల్లి మండల కేంద్రంలోనీ పెద్దమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కుక్కునూరుపల్లి మండల కేంద్రానికి మొదటిసారిగా వచ్చిన ఆయనను మండల బిజెపి పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించి, వార్షికోత్సవ వేడుకలకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులతో పాటు కుకునూరుపల్లి ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
WhatsApp Group
Join Now