Rate Cut: ప్రభుత్వం పలు ప్రాడక్టుల ధరలు తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించనుందా. సామాన్యులకు ఊరట కలిగించే విషయము ఒకటి ప్రస్తుతం వినిపిస్తుంది. అది ఏంటంటే ఒకటో తేదీ నుంచి ఈ ప్రాడక్టుల ధరలు దిగిరానున్నాయి అని తెలుస్తుంది. అయితే వేటి వేటి ధరలు తగ్గనున్నాయి అలాగే ఎందుకు తగ్గనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల ప్రారంభంలో కొత్త బడ్జెట్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ బడ్జెట్లో పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వివిధ ప్రాడక్టులపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కొన్నిటి ధరలు తగ్గనున్నాయి అని తెలుస్తుంది.
ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయని సమాచారం. ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ గూడ్స్ కు సంబంధించిన పరికరాల ధరలు తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్ కాంపోనెంట్స్ అంటే ఫోన్ విడిభాగాల ధరలు కూడా తగ్గనున్నాయని తెలుస్తుంది. మొబైల్ ఫోన్ బ్యాటరీ లో ఉపయోగించే 28 ఐటమ్స్ పై దిగుమతి సుంకాన్ని ఈ బడ్జెట్లో ఎత్తివేశారు. ఈ క్రమంలో ఫోన్లో మరియు యాక్సెసరీస్ ధరలు తగ్గుతాయి. ఎల్ఈడి మరియు ఎల్సిడి టీవీల ధరలు కూడా దిగి వస్తాయి. ఎందుకంటే టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్ సేల్స్ మరియు ఇతర కీలక విధి భాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించినట్లు ప్రతిపాదన ఉంది.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
దీని కారణంగా వీటి ధరలు కూడా తగ్గనున్నాయని తెలుస్తుంది. అలాగే ఇవి బ్యాటరీ లో మరియు కాంపోనెంట్ ధరలు కూడా తగ్గొచ్చు. ఈ బడ్జెట్లో లిథియం ఐ యాం బ్యాటరీ స్క్రాప్, కోబాల్ట్ మరియు ఇతర కీలక మెటీరియల్స్ పై సంకాలను తగ్గించడం జరిగింది. ఎక్కువగా వీటిని ఎలక్ట్రిక్ వాహనాలు తయారీలో ఉపయోగిస్తారు. దీని కారణంగా ఈ వీల రేట్లు కూడా తగ్గొచ్చు. దేశంలో ఈ వీల వినియోగాన్ని మరింత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ మరియు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ధరలు కూడా దిగిరానున్నాయని సమాచారం. ఈ బడ్జెట్లో 36 కీలకమైన మెడిసిన్స్ను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి ప్రభుత్వం మినహాయించింది.