Pushpa In Highcourt: పుష్ప-2 సినిమాపై వచ్చిన లాభాల విషయంలో హైకోర్టులో పిటిషన్ దాకలయింది. ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిటిషన్ దాఖలు చేస్తూ పుష్ప-2 సినిమాకి వచ్చిన లాభాల్లో చిన్న చిత్రాలకు, బడ్జెట్ రాయితీ, జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలని పిల్ దాఖలు చేశారు.
తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద న్యాయవాది నరసింహరావు ఈ పిల్ దాఖలు చేశారు. ఎక్స్ ట్ర షోలతో, పుష్ప-2 సినిమా టికెట్ ధరలను పెంచి విక్రయించడంతో ఈ సినిమాకు భారీ మొత్తంలో ఆదాయం వచ్చిందని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. హోంశాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరి ఎక్స్ట్రా బెనిఫిట్ షోలను, టికెట్ ధరలు పెంచుకునే విధంగా అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఈ సినిమా దర్శక, నిర్మాతలకు హోంశాఖ నుంచి వచ్చిన ప్రత్యేక ఉత్తర్వున ద్వారా భారీ మొత్తంలో లాభాలు గడించారని, కానీ హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడంలో కారణాలేంటో చెప్పలేదని ఆయన కోర్టుకు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సినిమాల లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
దీనికి సదరు న్యాయవాదిని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఆల్రెడీ ఎక్స్ట్రా షోలు టికెట్లపై అధిక ధరలు తీసుకోవడం అయిపోయింది ఉంది కదా అని అడిగారు. దీంతో న్యాయవాది సీజె ప్రశ్నకు బదులీస్తూ వాటి వల్ల వచ్చిన లాభం గురించే పిటిషన్ దాఖలు చేశామని వివరించారు. అందుకు తగిన విధంగా సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.