Property Rights: ప్రజలలో చాలామందికి భర్త చనిపోయిన తర్వాత అతని ఆస్తిపై భార్యకు ఎలాంటి హక్కులు ఉంటాయో అనే ప్రశ్న తలెత్తుతుంది. భర్త ఆస్తి విషయంలో కూడా భార్యకు అనేక హక్కులు ఉన్నాయి. భర్త చనిపోతే అతని ఆస్తిపై భార్యకు ఎలాంటి హక్కులు ఉంటాయి అనేదాని పై చాలామందిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం పెళ్లి అయిన తర్వాత చాలా తక్కువ హక్కులు ఉంటాయి. ఇంటి కోడలికి తన అత్తమామల ఆస్తిపై పెద్దగా హక్కు ఉండదు.
అయితే నిబంధనల ప్రకారం అత్తగారు మరణిస్తే ఆమె భర్తకు వారి ఆస్తిపై హక్కు ఉంటుంది. భర్త ఇక తర్వాత అత్తగారు, మామగారు కూడా చనిపోతే అటువంటి పరిస్థితుల్లో ఆస్తిపై హక్కు కోడలికి ఉంటుంది. దీనికి కూడా ఒక షరతు ఉంది. అత్తమామలు వాళ్ళ ఆస్తి వీలునామాలో మరెవరి పేరును కూడా రాయకపోతే ఆ సందర్భంలో ఆస్తి కోడలికి వెళుతుంది.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ఒకవేళ వీలునామాలో వేరొకరి పేరు ఉంటే ఆస్తిపై కోడలికి హక్కులు పొందడంలో ఇబ్బంది ఉండొచ్చు. హిందూ వితంతువు భరణం కేసు విచారణ సందర్భంగా ఛతీస్ఘడ్ హైకోర్టు ఒక తీర్పును ఇచ్చింది. ఈ తీర్పులో చతిస్గడ్ హైకోర్టు ఒక హిందూ వితంతువు తన ఆదాయంతో జీవించలేని క్రమంలో తన మామ నుండి భరణం పొందొచ్చు అని తెలిపింది. ఈ విధంగా భర్త మరియు అత్తగారు, మామగారు మరణించిన తర్వాత కోడలికి ఆస్తి హక్కులు ఉండే అవకాశం ఉంటుంది.