Pension: ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వాళ్ళకి బిగ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా దివ్యాంగులకు ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. కరీంనగర్ సర్ఫ్ దివ్యరాజ్ దివ్యాంగులకు యూ డి ఐ డి నెంబర్ జనరేట్ చేయాలని సూచించారు. సోమవారం నాడు సదరు సర్టిఫికెట్ల నుంచి యూనిక్ డిసేబులిటీ ఐడి జారీ చేయాలని తెలిపారు. కరీంనగర్లో ఉన్న దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ బదులు యూనిట్ డిసేబులిటీ ఐడి జారీ చేయాలని అలాగే సదరం సర్టిఫికెట్ నుంచి ఈ కార్డు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలి అని ఆయన తెలిపారు. యూ డి ఐ డి పోర్టల్ లో వైద్యులచే దివ్యాంగులకు ధ్రువీకరించిన వైకల్య శాతంతో కూడిన సదరం సర్టిఫికెట్ను నమోదు చేయాలని తెలిపారు.
అలాగే దివ్యాంగులకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని అన్నారు. యూ డి ఐ డి కార్డు పోస్టు ద్వారా దివ్యాంగులకు నేరుగా ఇంటి అడ్రస్ కు అందుతుందని చెప్పుకొచ్చారు. యూ డి ఐ డి కార్డులు అందులకు, విజన్, కుష్టి వ్యాధిగ్రస్తులకు, వినికిడి సమస్య కలవారికి, అంగన్ వైకల్యం గల వారికి, మానసిక వైకల్యం ఉన్నవారికి వైకల్య శాతాన్ని పరిశీలించి జారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే యూ డి ఐ డి కార్డుల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ద్వారా సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్లకి యూ డి ఐ డి కార్డు జనరేట్ చేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. దివ్యాంగులకు ఫిబ్రవరి 28, 2025 వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్లతో పెన్షన్ మరియు ఇతర సదుపాయాలు మన రాష్ట్రంలో పొందవచ్చని అలాగే ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సౌకర్యం పొందాలంటే దివ్యాంగులకు యూ డి ఐ డి కార్డు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. దివ్యాంగులకు మార్చి 1వ తేదీ నుంచి యు డి ఐ డి కార్డు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. యు డి ఐ డి కార్డు ద్వారానే పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.