SBI NEW PLAN: మనం ఎంత సంపాదించినా పొదుపు చేయకుంటే వ్యర్థం. పెట్టుబడి పెట్టి సంపాదించిన సంపదకు నిలకడ (సేవింగ్) చాలా ముఖ్యం. దీనికోసమే SBI బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ ఒక చక్కటి రాబడిని సృష్టించింది. ఇలాంటి ఒక కొత్త స్కీం ఇప్పుడు మనకోసం SBI మన ముందుకు తీసుకొచ్చింది. అదేంటో, ఆ కొత్త స్కీమ్ లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..!డబ్బు ఎంత సంపాదించినా దాని స్థిరత్వం కోసం మనం బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ లను ఆశ్రయించి ఎన్నో రకాల డిపాజిట్లను చేసి డబ్బులు పొదుపు చేస్తాం. ఫిక్స్డ్ (FIXED DEPOSIT) డిపాజిట్లు, బంగారు బాండ్లు, చిన్న పొదుపు పథకాలను చాలామంది ఇష్టపడతారు. పెట్టుబడులు సాధారణంగా ఒక సంవత్సరానికి 6 నుంచి 8 శాతం పరిమిత రాబడిని అందిస్తాయి. దీనికి విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్లు కొంత రిస్కుతో వచ్చినప్పటికీ చాలా ఎక్కువ రాబడిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
SBI బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీస్ ఫండ్ అనేది ఒక రంగంపై ఇప్పుడు దృష్టి సారించిన ఈక్విటీ మ్యుచువల్ ఫండ్, ఇది సాంప్రదాయ పెట్టుబడి ఎంపికలను గణనీయంగా అధిగమించింది. సంవత్సరానికి దాదాపు 15% సగటు రాబడితో, ఈ ఫండ్ పెట్టుబడిదారుల అనుక్రమేణా గణనీయమైన సంపాదను నిర్మించడంలో సహాయపడింది.సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఉదాహరణకు మీరు నెలకు ₹10వేల చొప్పున సేవింగ్ చేస్తే 10 సంవత్సరాలకు మొత్తం ₹12 లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే, ఇప్పుడు ఆ పెట్టుబడి 27.67 అవుతుంది. వార్షిక రాబడి 15.98% అవుతుంది. పెట్టుబడి ఎంపికలు కనీస అవసరాలకు సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు కనీసం నెలకు 500 రూపాయలు పొదుపు చేయాలనుకునే వారికి మంచి అవకాశం. ఈ నిధి చిన్న మరియు పెద్ద పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుంది. ఇది కాలక్రమేనా తమ పొదుపును పెంచుకోవాలనుకునే వ్యక్తులకు అద్భుతమైన ఎంపికగా మారుతుంది. ఎందుకంటే SBI బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసులు గత పనితీరు బలంగా ఉంది. గత దశాబ్దంలో 15.98% సేవింగ్ ఇన్స్ట్రుమెంట్ రాబడిని అందించింది.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
భారతదేశ ఆర్థిక విస్తరణకు బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగం చాలా కీలకమైనది. మీరు ఎంత కాలం ఎక్కువ పెట్టుబడి పెడితే కాంపౌండింగ్ వడ్డీ కారణంగా మీ సంపాదన అంత పెరుగుతుంది. సంపద సృష్టిని పెంచుకోవాలనుకునే పెట్టుబడిదారులకు ఈ SBI కొత్త స్కీమ్ ద్వారా SBI బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ ఒక చక్కని ఎంపిక అని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం కేవలం ₹ 500 రూపాయలతో ఈరోజే సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రారంభించి కాలక్రమేణా మీ పెట్టుబడి గణనీయంగా పెరగడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరిన్ని వివరాలకు SBI బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్లలలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు SBI మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ లేదా యాప్ ను సందర్శించండి.