PAN Card: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా పాన్ కార్డు తప్పనిసరిగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. బ్యాంక్ అకౌంట్లో వివిధ లావాదేవీలకు మరియు ఆదాయపు పన్నుకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే పాన్ కార్డు విషయంలో ఈ పొరపాటు చేస్తే పదివేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ తో అనుబంధించబడిన అన్ని సేవలను ప్రభుత్వం అధునాతన ఈ గవర్నెన్స్ చొరవల ద్వారా మెరుగుపరుస్తుంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం పాన్ 2.0 నీ ప్రవేశపెట్టింది. నకిలీ పాన్లను పూర్తిగా నిర్మూలించడానికి ఇది లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తులు జాగ్రత్త వహించాలి.
ఆదాయపు కొన్ని శాఖ నకిలీ పాన్ కార్డులు కలిగి ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా అదనపు పాన్ కార్డును అప్పగించడంలో విఫలం అయితే పదివేల రూపాయలు జరిమానా విధించవచ్చు. ఒక వ్యక్తి దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు ఉండడం నేరంగా పరిగణిస్తారు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ పాన్ కార్డులు ఉన్నట్లయితే ఆదాయపు పన్ను శాఖకు అందించాలి. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్ను చెల్లించేవారు మరియు పన్ను చెల్లించని వారు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు కలిగి ఉండడం నిషేధం.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ఒక వ్యక్తి అనుకోకుండా లేదా పూర్వకంగా కానీ ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా ఆదాయపు పన్ను శాఖకు అందించాలి. లేకుంటే ప్రభుత్వం నుంచి తీవ్ర పరిమాణాలను ఎదురుకోవాలి. అయితే వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నకిలీ పాన్ కార్డులను సులభంగా గుర్తిస్తున్నారు. తాజాగా ఆమోదించిన పాన్ 2.0 పథకం ప్రకారం పన్ను మినహాయింపు నిర్వహణను క్రమబద్ధీకరించడం అలాగే ఆధునికరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే దీని లక్ష్యాలలో నకిలీ పాన్ కార్డులను గుర్తించి తొలగించడం మరియు మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడం కూడా ఉన్నాయి.