ఆర్మూర్, మార్చ్ 4 (ప్రజా శంఖారావం): పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపారు. మంగళవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్, మామిడిపల్లి గ్రామ శివారులలో పేకాట ఆడుతున్న స్థావరంపై రైడ్ చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వారి వద్ద నుండి ₹ 45,100/- రూపాయలతో పాటు 5 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు ఈ రైడింగ్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. 9 మంది పేకాటరాయుళ్లను తదుపరి చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ కు అప్పగించినట్లు తెలిపారు.
Advertisement
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now