PAN Card: ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక లావాదేవీలు మరియు ప్రభుత్వ పథకాలకు పర్మినెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. కానీ మనలో చాలామందికి పాన్ కార్డు గురించి పూర్తి ఉపయోగాలు తెలియవు. కేవలం పాన్ కార్డు ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ లో మాత్రమే కాకుండా బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ సహా పెద్దపెద్ద ఫైనాన్షియల్ డీలింగ్స్ లో కూడా ఉపయోగపడుతుందని చాలామందికి తెలియదు. కొన్ని ట్రాన్సాక్షన్స్ చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి. కొన్ని అయితే పాన్ కార్డు లేకుండా అసలు సాధ్యం కాదు. భారత ఆదాయ పన్ను విభాగం జారీ చేసే పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడి నెంబర్ను పాన్ కార్డు అని అంటారు.
ఇది ప్రతి ఒక్కరికి చాలా కీలక ఫైనాన్షియల్ డాక్యుమెంట్. టాక్సేషన్ తో పాటు ఫైనాన్షియల్ యాక్టివిటీస్ లో పాన్ కార్డు ఉపయోగం చాలా ఉంటుంది. పాన్ కార్డుతో ఇన్కమ్ ను ట్రాక్ చేయడం అలాగే లావాదేవీలను పర్యవేక్షించడం టాక్స్ ఎగవేతలను అడ్డుకోవడం వంటి చాలా ఉపయోగాలు ఉంటాయి. బ్యాంకులో పొదుపు, కరెంట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను తెరిచేటప్పుడు తప్పనిసరిగా బ్యాంక్ అధికారులు పాన్ కార్డును అడుగుతారు. ఒక వ్యక్తి బ్యాంకులో ఒక రోజులో 50 వేల కంటే ఎక్కువ డబ్బును డిపాజిట్ చేస్తే పాన్ కార్డును కూడా అందించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
అలాగే లోన్లు లేదా క్రెడిట్ కార్డులను ఆమోదించే ముందు దరఖాస్తుదారుడి క్రెడిట్ హిస్టరీ మరియు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంచనా వేయడానికి ఆర్థిక సంస్థలకు తప్పనిసరిగా ఆ వ్యక్తి పాన్ వివరాలు అవసరం అవుతాయి. అలాగే షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి మరియు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి కూడా పాన్ కార్డు అవసరమవుతుంది. ఒక వ్యక్తి డి మ్యాట్ అకౌంట్ తీసుకునేటప్పుడు పాన్ కార్డు ఇస్తేనే అక్కడ ప్రాసెస్ పూర్తవుతుంది. 50,000 దాటిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కు కూడా పాన్ కార్డు తప్పనిసరి. ట్రాన్స్పరెంట్ గా బంగారం కొనాలంటే మరియు ఎలాంటి పను ఎగవేత ఉండదనుకుంటే పాన్ కార్డు తప్పనిసరి. రెండు లక్షల కంటే ఎక్కువ బంగారం కొంటే మాత్రం పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.