New UPI Rules: కొత్త యూపీఐ నియమాల ప్రకారం యూపీఐ వినియోగదారుల ఖాతాలోని డబ్బులు ప్రతినెల 14 రోజులు బ్లాక్ అవుతాయట. ఆర్.బి.ఐ వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్యను చేపట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కొత్త యూపీఐ నియమాలు అమలులోకి వచ్చాయి. ఈ కొత్త నియమాల ప్రకారం ఖాతాలోని డబ్బులు ప్రతి నెల 14 రోజులు బ్లాక్ అవుతాయి. ఆర్బిఐ వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్యను చేపట్టినట్లు వివరించింది. వినియోగదారుల సమ్మతితో వాళ్ళ ఖాతాలో ఉన్న డబ్బును ప్రతి నెల 14 రోజులు బ్లాక్ చేస్తారు. ఆ 14 రోజులు ముగిసిన తర్వాత ఆ డబ్బు తిరిగి వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమవుతుంది.
వినియోగదారులకు భీమా లేదా EMI చెల్లింపులను నిర్వహించడంలో ఇది సహాయపడుతుందని తెలుస్తుంది. చాలామంది వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను ఆదా చేసి వాటిని బీమా పేమెంట్ చెల్లింపుల కోసం ఉపయోగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారికి ఆ డబ్బును వేరే అవసరాల కోసం ఉపయోగించాల్సి వస్తుంది. ఈ క్రమంలో వాళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతారు. ఈ చర్యను నివారించేందుకు ప్రస్తుతం బ్యాంకులో తమ వినియోగదారుల సమ్మతితో ఖాతాలో ఉన్న డబ్బును 14 రోజులు బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ఈ 14 రోజుల వ్యవధిలో భీమా సంస్థలు తమ డబ్బును ఉపసంహరించుకుంటే బ్యాంకు ఖాతా నుంచి ఆ డబ్బు భీమా సంస్థ ఖాతాకు బదిలీ అవుతుంది. ఒకవేళ ఆ 14 రోజుల్లోపు భీమా సంస్థ డబ్బును తీసుకోకపోతే ఆ డబ్బు తిరిగి వినియోగదారుని ఖాతాలో చేరుతుంది. ప్రస్తుతం వచ్చిన ఈ కొత్త నియమాల ప్రకారం వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలలోనే నెలవారి బీమా మరియు రుణ మొత్తాలను సులభంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చెల్లించగలుగుతారు. తాజాగా యూపీఐ వ్యవస్థ ద్వారా ఇటువంటి విధానం అమలులోనికి రావడం వినియోగదారులకు మరింత సులభతరంగా మారింది. ఈ కొత్త నియమాల ద్వారా భీమా చెల్లింపుల ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది.