RBI 2000 Notes Exchange: కొంతమంది దగ్గర ఇంకా పొరపాటున 2000 నోట్లు మిగిలిపోయి ఉంటాయి. అయితే ఆ నోట్లను ఎలా మార్చుకోవాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. మీ దగ్గర పొరపాటున మిగిలిపోయిన 2000 నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియడం లేదా. అయితే అటువంటి వారి కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలక ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 మే నెల నుంచి పెద్ద నోటుగా ఉన్న రెండువేల రూపాయల నోటును సర్కులేషన్ నుంచి ఉపసంహరించినట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆ సమయంలో ప్రజల దగ్గర ఉన్న 2000 రూపాయల నోటును బ్యాంకులో మార్చుకునేందుకు అవకాశం కూడా కల్పించింది. అదే సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ అదే ఏడాది అక్టోబర్ 7వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు ఆర్బిఐ తెలిపింది. ఆ తర్వాత మళ్లీ ఆర్బిఐ కేవలం దేశంలోనే 19 ఆర్బిఐ రీజినల్ కార్యాలయాలలో 2000 రూపాయల నోటును మార్చుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. తాజాగా ఆర్బిఐ ఫిబ్రవరి 28, 2025 నాటికి చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లలో 98.18 శాతం నోట్లు బ్యాంకులోకి వచ్చాయని మిగిలిన 6,471 కోట్లు విలువైన నోట్లు ప్రజల దగ్గరే ఉన్నాయని తెలిపింది.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ఇది కూడా చదండి : రోజుకు రూ.500 పెడితే ఒకేసారి పది లక్షలు పొందొచ్చు.. ఎస్బిఐ అదిరిపోయే స్కీమ్ తెలుసుకోండి
ఇక గతంలో కూడా ఆర్బిఐ 2023 మే 19న 2000 నోట్లు వెనక్కి చేయాలని ప్రకటించినా సమయంలో 3.56 లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. 2023 అక్టోబర్ నెల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాలలో ఈ నోట్లను మార్చుకునేందుకు ఆర్బిఐ అవకాశం కల్పించింది. ఒకవేళ మీ దగ్గర 2000 నోట్లు మిగిలి ఉంటే ఆర్బిఐ కార్యాలయాలకు వెళ్లి మార్చుకోవచ్చు. ఒకవేళ అక్కడి వరకు వెళ్లలేని వాళ్లు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆర్బిఐ ఆఫీసులకు పంపించుకొని ఈ నోట్లను మార్చుకోవచ్చని ఆర్బిఐ తెలిపింది. 2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్న కూడా ఇప్పటికి చట్టబద్ధ కరెన్సీగా కొనసాగుతుందని తాజాగా ఆర్బిఐ స్పష్టం చేసింది.