New Ration Cards: కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటున్న వారికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అలర్ట్ ప్రకటించింది. కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నవారు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు జారీ చేసే హామీలో మరోసారి జాప్యాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటికే పలు నివేదికల ప్రకారం హైదరాబాదులో పంపిణీ మార్చి ఒకటి నుండి ప్రారంభమవుతుందని తెలుస్తుంది. కానీ పౌరసరఫరాల విభాగానికి ఇంకా అధికారిక ఆదేశాలు అందలేదని సమాచారం. దీని గురించి ఇప్పటివరకు ఎటువంటి సన్నాహాలు జరగలేదని స్థానిక నివేదికలు చెప్తున్నాయి.
ప్రముఖ దినపత్రిక ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లు తప్పనిసరిగా వార్డు సమావేశాలను నిర్వహించాలి. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు ఆదేశాలు జారీ చేయాలి. నగరంలో ఉండే మీసేవ కేంద్రాల ద్వారా చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. వాటి అర్హత ప్రమాణాలపై అప్లై చేసుకున్న దరఖాస్తులను హైదరాబాదులోని సర్కిల్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీ చేస్తారు. ఇప్పటివరకు అధికారులకు కూడా రేషన్ కార్డుల జారిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే హైదరాబాద్ నగరంలో ఆలస్యం జరుగుతుండగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈరోజు నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
ఇప్పటివరకు అధికారులు మొత్తం 1,21,016 రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరించారు. వీటిలో 33,435 గ్రామసభలు, వార్డు సబల ద్వారా మరియు ప్రజా పరిపాలన ద్వారా వచ్చినవి. ఇప్పటివరకు ఈ 33,435 దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ పూర్తయిందని తెలుస్తుంది. అధికారులు కుల గణన ద్వారా నిర్వహించిన నివేదిక తర్వాత 6700 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. ఈరోజు నుంచి వీటి పంపిణీ ప్రారంభమవుతుందని సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నివేదికల ప్రకారం 6.68 లక్షల నిరుపేద కుటుంబాలను కొత్త రేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించిన జాబితాను రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రతినిధులకు పంపించారు. ఇక ఈ కుటుంబాల జాబితాలో మొత్తం 11,65,052 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయని సమాచారం.