Thursday, 13 March 2025, 0:27

Medak: విద్యార్థులుగా మారిన ఉపాధ్యాయులు.!

Medak: కొల్చారం, మార్చి 01(ప్రజా శంఖారావం): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులే విద్యార్థులుగా మారారు. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని అంసాన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులుగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా స్వయం పరిపాలనలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ రావు, పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యార్థుల ద్వారా ఎదుర్కునే సమస్యలను స్వయంగా విద్యార్థులు తెలుసుకుంటారని, బోధన అనుభవం అనేది విద్యార్థులకు ప్రాథమిక తరగతులలోనే కలగాలని ఉపాధ్యాయ వృత్తి పట్ల అంకితభావం ఏర్పడాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు.

విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి భవిష్యత్తులో విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా రాణించాలని స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారిగా కార్తీక్, మండల విద్యాధికారిగా నివాస్, పోషకుల ప్రతినిధిగా క్రాంతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా వైష్ణవి, ఉపాధ్యాయులుగా స్రవంతి, నందిని,కల్పన విక్రం, నవదీప్, దుర్గేష్,జగన్, శ్రీకాంత్, ఆనంద్, సికిందర్, విష్ణు, రామ్ చరణ్ తేజ్, పాఠశాల సహ ఉపాధ్యాయులు యాదగిరి మనోహర్రావు వైద్య శ్రీనివాస్ వసంతరాణి వినోద నర్సింలు షాకీర్ అలీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *