Congress: ఆర్మూర్, ఫిబ్రవరి 25 (ప్రజా శంఖారావం): విద్యావేత్త, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి పట్టభద్రులంతా అండగా నిలిచి భారీ మెజార్ తో గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ లో పివిఆర్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో అయన మాట్లాడుతూ…. బిఆర్ఎస్ హయంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు.
కాంగ్రెస్ వచ్చిన 14 నెలల్లో 54 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.ఈ విలేకరుల సమావేశంలో ఆర్మూరు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ ఇట్టo జీవన్, గ్రంధాలయ మాజీ చైర్మన్ మారా చంద్రమోహన్, నాయకులు మోత్కూరి లింగా గౌడ్, అయ్యప్ప శ్రీనివాస్ ,పండిత్ పవన్, మచ్చర్ల జితేందర్, ఆకుల రాము, శాల ప్రసాద్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.