Arrest of RPs: మెట్ పల్లి, డిసెంబర్13 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా మెట్ పల్లి బస్టాండ్ లో రిసోర్స్ పర్సన్ (ఆర్‌పీ)లను పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. ప్రతి నెలా చెల్లించే గౌరవ వేతనాన్ని గత 8 నెలల నుండి చెల్లించకపోవడంతో రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు హైదరాబాద్ లోని మెప్మా కార్యాలయం ముందు నిరసన తెలిపేందుకు మెట్ పల్లి ఆర్పీ లు బయలుదేరారు. వారి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు హైదరాబాద్ బయలుదేరిన ఆర్పీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆర్పీ లు మాట్లాడుతూ తమకు 8 నెలల నుండి జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమకు బకాయి ఉన్న జీతాలు వెంటనే చెల్లించి ఆదుకోవాలనీ కోరారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now