Write to the villagers: మెట్ పల్లి, డిసెంబర్ 12 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామస్తులు గురువారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలోని ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్ లో విలీనం చేయవద్దంటూ నిరసన తెలిపి బైఠాయించారు. ఫ్లాకార్డులు చేతులు పట్టుకొని ఎండోమెంట్ అధికారులకు వ్యతిరేకంగా గ్రామస్తులు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now