The concern of the villagers: మెట్ పల్లి, డిసెంబర్10 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి విలీనం చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయని మంగళవారం ఆలయాన్ని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఆధ్వర్యంలో అధికారులు ఆలయాన్ని పరిశీలించి స్వాధినపరుచుకున్నట్లు తెలిపారు. ఈ విషయo తెలుసుకున్న గ్రామస్తులు ఆలయాన్ని ఎండోమెంట్ పరిగణనలోకి తీసుకోవద్దని గ్రామస్తులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధికారులకు గ్రామస్తులకు వాగ్వాదం జరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపటి తర్వాత అధికారులు అక్కనుండి వెళ్ళిపోయారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now