* ఆ ఎమ్మెల్యే సీటుపై జిల్లాలో జోరు చర్చ..!
* సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ప్రశ్నల వర్షం
Loud discussion on MLA Sanjay: జగిత్యాల జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 9 (ప్రజా శంఖారావం): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ మారి అధికారి పార్టీ కాంగ్రెస్ లో చేరడంతో సోమవారం నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆ ఎమ్మెల్యే ఎటువైపు కుర్చీలో కూర్చుంటారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే అనుకుంటున్నారా..! ఎవరో కాదు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై నెటిజన్ల సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ తరపున జగిత్యాల ఎమ్మెల్యే గా గెలిచి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ఆయన ఏ పార్టీకి కేటాయించిన సీట్లో కుర్చుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విహార యాత్రలో ఎమ్మెల్యే..?
ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరవుతా ఉంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జైపూర్ టూర్ లో ఉన్నట్లు తెలిసింది. స్థానిక నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో తన గళం వినిపించాల్సిన ఎమ్మెల్యే టూర్ లో ఉండడంతో నేటిజన్లు స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేకు పట్టింపు లేదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ అరెస్ట్ కావడంతో మరి జగిత్యాల ఎమ్మెల్యే మరి ఎటువైపు నిలబడతారోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.