Handed over 2 lakh LOC: ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 02 (ప్రజా శంఖారావం): నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అరుంధతి నగర్ కు చెందిన వైష్ణవి అనారోగ్య కారణాలతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రి హైదరాబాదులో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య రీత్యా మెరుగైన చికిత్స అందించడానికి బాధితురాలి తండ్రి పిఓపి పోశెట్టి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని ప్రభుత్వ ఆర్థిక సహాయ నిమిత్తం కలిశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎల్ఓసిని బాధిత కుటుంబ సభ్యులకు బుధవారం వినయ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబ సభ్యులు వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now