** హోటల్ వంటకాలపై డ్రైనేజీ వాటర్
** మూత్రశాల పైప్ లైన్ లీకేజీలు
* జాడ లేని ఫుడ్ ఇన్స్పెక్టర్..?
* నామమాత్రంగా సానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీలు..!
RTC Bustand Canteen: ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 01 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ లోని క్యాంటీన్ లో అంతా అపరిశుభ్రం. హోటల్లో తయారు చేసే వంటకాలపై డ్రైనేజీ వాటర్ పడుతూ కలుషితమవుతున్న సంబంధిత శాఖ అధికారులు ఎవరు కన్నీత్తి చూడడం లేదు. పట్టణ కేంద్రంలోని చాలా హోటల్లోతోపాటు రెస్టారెంట్లలో ఉపయోగించే నూనె, తినుబండారాలు కల్తీ అవుతున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు లేకపోవడం పట్ల పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న బస్టాండ్ క్యాంటీన్ లో అపరిశుభ్రంగా ఆహార పదార్థాలు నిల్వ ఉండడం, హోటల్లో వాడే పిండి వంటకాలపై డ్రైనేజీ వాటర్ లీకేజి అవుతు కలుషితమవుతున్నాయి. గడిచిన రెండు రోజుల క్రితం ఆర్మూర్ మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ గజనంద్ ప్రత్యక్షంగా తనిఖీ చేసిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. హోటల్ లోని ఆయిల్ ఇంజన్ ఆయిల్ రంగులోకి మారిన మంచి నూనెతో వంటకాలు చేస్తూ ప్రయాణికుల ఆరోగ్యాలతో సదరు హోటల్ యజమాని చెలగాటమాడుతున్నారు.
మరోవైపు వంట గదిలో పక్కనే ఉన్న మూత్రశాలల పైపులు లీకై నీరు వంటగదిలో కురుస్తుండగా వాటి మధ్యనే క్యాంటీన్ కి సంబంధించిన వంటకాలను చేస్తు ప్రయాణికులకు అందిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటుచేసిన క్యాంటీన్ పై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించకపోవడం, మరోవైపు ఫుడ్ ఇన్స్పెక్టర్ సైతం తొంగిచూడక పోవడంతో ఇలాంటి నిర్వాహకులకు ఆడింది ఆట పాడింది పాటగా మారింది.
మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ వివరణ: గజానంద్
ఆర్మూర్ మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ గజానందును వివరణ కోరగా ఆర్టీసీ బస్టాండ్ లోని క్యాంటీన్ లో ప్లాస్టిక్ కవర్లు నిల్వ ఉన్నట్లు వచ్చిన సమాచారంతో వెళ్లి చూడగా క్యాంటీన్లోని వంట గది అపరిశుభ్రంగా ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. అలాగే పిండి వంటకాలపై పక్కనే ఉన్న డ్రైనేజీ వాటర్ లీక్ అవుతుందని అన్నారు. వంటలు వాడిన నూనె డ్రమ్ముల్లో నిల్వ చేసి మళ్ళీ తిరిగి అదే నూనె ను వాడుతున్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు.
సదరు క్యాంటీన్ యజమానికి మొదటి తప్పుగా భావించి హెచ్చరించినట్లు ఆయన వివరణ ఇచ్చారు. రెండు రోజుల్లో డ్రైనేజీ లీక్ అవుతున్న పైప్లైన్ సరిచేసుకొని, శుభ్రత పాటించాలని సూచించామని, లేని పక్షంలో జరిమానా విధిస్తామని చెప్పినట్లు సానిటరీ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్ సూపర్డెంట్: మురళి
ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న క్యాంటీన్ విషయం అపరిశుభ్రత ఉన్నట్లు తన దృష్టికి ఇప్పుడే వచ్చిందని, తాను గెడిచిన రెండు రోజుల క్రితమే బదిలీపై వచ్చానని తెలిపారు. మంగళవారం డిపో మేనేజర్ అందుబాటులో లేరని, కార్యాలయం పని పై బయటకు వెళ్లారని అన్నారు. డిపో మేనేజర్ రాగానే క్యాంటీన్ పరిస్థితిపై వెల్లడిస్తానని వివరణ ఇచ్చారు. పరిశుభ్రంగా క్యాంటీన్ పరిసర ప్రాంతాలను ఉంచకుండా నాణ్యత ప్రమాణాలను పాటించకపోతే సదరు యజమానిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.