Female suicide: జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 04 (ప్రజా శంఖారావం): కాళ్ల పారాణి ఆరకముందే, తనువు చాలించి కాటికి పయనమైంది నవవధువు. పెళ్లి జరిగి నెల తిరగకుండానే వివాహిత ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అరచేతిపై తన చావుకు ఎవరు బాధ్యులు కారంటూ రాసుకుని మరి తనువు చాలించింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి కి మ్యడంపల్లి చెందిన ఉదయ్ కిరణ్తో ఆగస్టు 18 వివాహం జరిగింది.
కిరణ్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో నివసిస్తున్నారు. వివాహం అనంతరం మంగళవారం రోజున భాగ్యలక్ష్మి పుట్టింటికి వచ్చింది. మరుసటి రోజు బుదవారం వాష్ రూంలో ఉరివేసుకొని ఆత్మ హత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తన చావుకు ఎవరు బాధ్యులు కారని అరచేతిలో మృతురాలు రాసుకోవడం గమనార్హం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.