India: వెబ్ డెస్క్, ఆగస్టు 18 (ప్రజా శంఖారావం): భారత్ లో రోజు రోజుకి డింక్స్ జంటలు పెరిగిపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా జంటలపై లాన్సెట్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. కుటుంబంలో ఇద్దరు డబ్బు సంపాదిస్తున్న వారు పిల్లల్ని కనొద్దని భావించే జంటల్ని డింక్స్ (డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్) గా పిలుస్తారు. వీరు పిల్లల కంటే తమ ఇతర అవసరాలపై దృష్టి సారించాలని ఆలోచన ఎక్కువగా ఉంటుందని ఈ సంస్థ తెలిపింది. ఈ సాంప్రదాయం విదేశాల్లో ఎక్కువగా ఉండేదని ఇప్పుడు భారత్ లోను కూడా ఈ తరహా సంస్కృతి పెరిగిపోతుందని ఈ సంస్థ ఒక అంచనా వేసింది. సర్వే రిపోర్టుల అంచనాలకు తగ్గట్టుగానే జనాభా వృద్ధిరేటు భారత్ లో పడిపోతుందని సంస్థ పేర్కొంది. 1950 లో భారత సంతానోత్పత్తి వృద్ధిరేటు 6.18శాతం ఉండగా, 2021 సంవత్సరం కల్లా 1.91 శాతానికి సంతానోత్పత్తి రేటు తగ్గినట్లు ఈ సంస్థ వెల్లడించింది.
India: భారత్ లో పెరిగిపోతున్న డింక్స్ జంటలు
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now