October 22, 2024
Be Alert
Be Alert

Be Alert: సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారా? అంతే..!

Be Alert: వెబ్ డెస్క్, ఆగస్టు 12 (ప్రజా శంఖారావం): ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్, టెలిగ్రాం, తదితర సోషియల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు.

అనాలోచితంగా పోస్టులు పెట్టడం వల్ల జరిగే కీడును గుర్తించాలన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు.

వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే విధంగా, పార్టీల మధ్య చిచ్చులు పెట్టే పోస్టులకు దూరంగా ఉండాలన్నారు. మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడితే సహించబోమన్నారు.

సోషల్ మీడియా అకౌంట్స్, పోస్టులను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు.

ప్రతిక్షణం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.

సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో వాస్తవాలను వక్రీకరిస్తూ ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెడుతూ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, వ్యక్తిగత పరువును దెబ్బ తీసే విధంగా చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా నిఘా పెట్టిందని తెలిపారు.

జిల్లా ఎస్పీహెచ్చరిక:

ఈ బృందం అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకొని 24×7 పర్యవేక్షణలో ఉంటుందన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్ధేశ్యంతో పోస్టులు పెట్టిన వ్యక్తుల వివరాలను తెలుసుకొని వారికి నోటీసులు జారీ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ఉపక్రమిస్తుందన్నారు.

తాము పోస్టు పెట్టేటపుడు ఇతరుల మతాలు, కులాలు, మనోభావాలకు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించకుండా ఉండాలన్నారు.

పోస్టుల్లో వాస్తవాలను వక్రీకరించడం, వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు చేయడం వలన ఇతరుల మనోభావాలు దెబ్బతింటాలన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలన్నారు.

సోషల్ మీడియాను పాజిటివ్ విషయాలను విస్తృతం చేసేందుకు, దూర ప్రాంతాల్లో ఉన్న మిత్రులు, బంధువులను దగ్గరికి చేర్చే విధంగా వినియోగించుకోవాలని కోరారు.

నేటి యువత సోషల్ మీడియాకి బానిసై, సోషల్ మీడియాలో ముందు ఉండాలనే ఆశతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, ఇష్టారీతిన పోస్టులు పెట్టి, చట్టాన్ని ఉల్లంగిస్తున్నారని అన్నారు.

అంతేకాకుండా, తమ విలువైన సమయాన్ని వృదా చేసుకొంటూ, లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నారని అన్నారు.

యువత, ప్రజలు సోషల్ మీడియాను పాజిటివ్ కోణంలో వినియోగించుకోవాలన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోవాలన్నారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఏదో చేద్దామని అనుకొని, విద్వేషాలను రెచ్చగొడుతూ, అల్లర్లు ప్రేరేపించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నెటిజనులను హెచ్చరించారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!